ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనుష్క ఫస్టులుక్ అదరగొట్టేసింది

Sat, Aug 06, 2016
అనుష్క
అనుష్క
నాగార్జున ప్రధాన పాత్రధారిగా .. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రకి సంబంధించిన ఫస్టులుక్ ను వదులుతూ వస్తున్నారు. అలా ఈ రోజున అనుష్క ఫస్టులుక్ ను వదిలారు. ఈ సినిమాలో అనుష్క 'కృష్ణమ్మ' అనే భక్తురాలుగా నటిస్తోంది. అందుకు సంబంధించిన ఆమె లుక్ అద్భుతంగా వుంది.

గోదాదేవి మాదిరి అలంకారంతో .. దీపాలను వెలిగించిన పళ్లెం పట్టుకుని నడిచి వస్తున్నట్టుగా వున్న ఆమె లుక్ చాలా బాగా వచ్చింది. ఈ లుక్ లో అనుష్కకి నూటికి నూరు మార్కులు వేయని వాళ్లంటూ ఉండరనే చెప్పాలి. ఈ పాత్ర గెటప్ విషయంలో రాఘవేంద్రరావు ఎంత శ్రద్ధ తీసుకున్నారనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ లుక్ తో అంచనాలు మరింతగా పెరగడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)