ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సమంతా స్థానంలో తమన్నా!

Sat, Aug 06, 2016
తమన్నా
తమన్నా
నాగచైతన్య తాజా చిత్రం 'కల్యాణం'లో తమన్నాను కథానాయికగా ఎంపిక చేశారనే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. నాగచైతన్య కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

మొదట చైతూ జోడీగా సమంతాను తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఆమె స్థానంలో తమన్నాను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. గతంలో చైతూ జోడీగా తమన్నా, 100% లవ్ .. తడాఖా సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. అందువలన ఈసారి కూడా ఆమెనే తీసుకున్నారని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియో స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాతో, ఈ జంటకి హ్యాట్రిక్ హిట్ దొరుకుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)