ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రంగంలోకి దిగుతోన్న వెంకటేశ్

Sat, Aug 06, 2016
వెంకటేశ్
వెంకటేశ్
మారుతి దర్శకత్వంలో వెంకటేశ్ - నయనతార జంటగా 'బాబు బంగారం' సినిమా తెరకెక్కింది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దాంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుకానున్నాయి. మొదటినుంచి కూడా నయనతార ఆడియో రిలీజ్ ఫంక్షన్లకు .. ప్రమోషన్ కార్యక్రమాలకి హాజరుకాదనే సంగతి తెలిసిందే.

ఇది సినిమాకి కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినా, ఆమెకి గల క్రేజ్ కారణంగా తప్పదనుకుంటూ వస్తున్నారు. అలాగే ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా రావడం లేదు. దాంతో వెంకటేశ్ రంగంలోకి దిగుతున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో తాను చురుగ్గా పాల్గొంటానని నిర్మాతలకి వెంకటేశ్ భరోసా ఇచ్చాడని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)