ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రీ ఎంట్రీకి సిద్ధమవుతోన్న రంభ

Sat, Aug 06, 2016
రంభ
రంభ
తెలుగు తెరపై గ్లామర్ కి అర్థం చెప్పిన నిన్నటి తరం కథానాయికలలో రంభ ఒకరు. అగ్రహీరోలతో జోడీకట్టి తెరపై అల్లరి చేసిన రంభ, అప్పట్లో కుర్రకారు కలల రాణిగా ఒక వెలుగు వెలిగింది. వివాహం తరువాత ఆమె సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చింది.

ఇక ఇప్పుడు ఆమె తన వయసుకి తగిన పాత్రలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా తెలుస్తోంది. రీ ఎంట్రీ ఇవ్వాలని ఉందని ఇండస్ట్రీలోని సన్నిహితులతో అన్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. నిన్నటితరం కథానాయికలలో కొంతమంది రీ ఎంట్రీ ఇచ్చి, ముఖ్యమైన పాత్రలను సంపాదించుకుంటూ బిజీ అయ్యారు. దాంతో రంభ కూడా ఇంట్రెస్ట్ చూపుతోందని అంటున్నారు. త్వరలోనే ఆమె ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)