ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ధ్రువ' విలన్ కి హాలీవుడ్ ఆఫర్

Sat, Aug 06, 2016
అరవింద్ స్వామి
అరవింద్ స్వామి
ఒకప్పుడు అమ్మాయిలకు కలల రాకుమారుడిగా నిలిచిన 'రోజా' ఫేం అరవింద్ స్వామి, ఆమధ్య 'కడలి' సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన సంగతి విదతమే. అప్పటి నుంచీ పాజిటివ్ క్యారెక్టర్లతో పాటు, విలన్ పాత్రలను కూడా పోషిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నటుడు హాలీవుడ్ కి కూడా వెళుతున్నాడు. ప్రముఖ హాలీవుడ్ హిట్ చిత్రం 'మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్' నిర్మాతలు నిర్మించే తదుపరి చిత్రంలో నటించే ఛాన్స్ అరవింద్ స్వామికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఆ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఈయనతో చిత్ర నిర్మాతల ఏజంట్స్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆ ఆఫర్ పట్ల అరవింద్ కూడా సానుకూలంగా వున్నట్టు, వారికి కావలసిన డేట్స్ సర్దుబాటు చేసే పనిలో వున్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ధ్రువ' చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం తమిళ మాతృక 'తని ఒరువన్'లో కూడా అరవింద్ అదే పాత్రను పోషించాడు.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)