ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సురేందర్ రెడ్డితో చేయాలని వుందట!

Fri, Aug 05, 2016
నితిన్
నితిన్
'అ ఆ' సినిమాతో భారీ హిట్ కొట్టిన నితిన్, తన తదుపరి సినిమా కోసం కథలు వింటున్నాడని అంటున్నారు. దాంతో ఆయన తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉంటుందా అనే ఆసక్తి అందరిలోను తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని తెరపై అద్భుతంగా ఆవిష్కరించడం సురేందర్ రెడ్డి ప్రత్యేకత. హీరోయిజాన్ని ఒక రేంజ్ లో చూపించే సురేందర్ రెడ్డి, భారీతనం తన సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా ఉండేలా చూసుకుంటాడు. అందువలన ఆయన దర్శకత్వంలో చేయడానికి నితిన్ ఆసక్తిని చూపుతున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం చరణ్ తో ఆయన 'ధ్రువ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయనని నితిన్ ఒప్పిస్తాడేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)