ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందట!

Fri, Aug 05, 2016
'శ్రీరస్తు శుభమస్తు' లో లావణ్య త్రిపాఠి - అల్లు శిరీష్
'శ్రీరస్తు శుభమస్తు' లో లావణ్య త్రిపాఠి - అల్లు శిరీష్
పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు శిరీష్ .. లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమా కథా కథనాల గురించి అటుంచితే, ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కలవారి అబ్బాయిగా శిరీష్ .. మధ్యతరగతి అమ్మాయిగా లావణ్యత్రిపాఠి నటించారు.

లుక్ విషయంలోను .. బాడీ లాంగ్వేజ్ విషయంలోను శిరీష్ మంచి మార్కులు కొట్టేశాడని అంటున్నారు. ఇక గత చిత్రాలతో పోలిస్తే శిరీష్ నటనలో పరిణతి కనిపించిందని చెబుతున్నారు. ఇక అనన్య పాత్రలో లావణ్య బాగా మెప్పించిందని అంటున్నారు. తెరపై ఈ జోడీ ఆకట్టుకునేదిలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)