ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇకపై స్పీడు పెంచుతాడట!

Fri, Aug 05, 2016
చంద్రశేఖర్ యేలేటి
చంద్రశేఖర్ యేలేటి
వైవిధ్యభరితమైన కథాంశాలను తెరకెక్కించడానికే చంద్రశేఖర్ యేలేటి ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తుంటాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఆ విషయాన్ని నిరూపిస్తూ ఉంటాయి. అలా తాజాగా ఆయన 'మనమంతా' సినిమాను ఈ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

ఈసారి కొన్ని కారణాల వలన తన నుంచి సినిమా రావడానికి ఎక్కువ సమయం పట్టిందనీ, ఇక నుంచి స్పీడుగా సినిమాలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పాడు. ఆల్రెడీ రెండు కథలు సిద్ధంగా ఉన్నాయనీ .. నిర్మాతలు కూడా రెడీగానే వున్నారని అన్నాడు. ఈ రెండు కథల్లో ఏ కథను ముందుగా మొదలు పెట్టాలి .. నటీనటులను ఎవరిని తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పాడు. త్వరలోనే ఈ విషయాన్ని తెలియజేస్తానని అన్నాడు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)