ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

Thu, Aug 04, 2016
'జనతా గ్యారేజ్' సినిమా ఆడియో వేడుక ఆగస్టు 12న జరగనున్నట్టు ఇటీవల ఒక వార్త బయటికి వచ్చింది. అదే డేట్ ను ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఖరారు చేస్తూ, ఆడియో రిలీజ్ డేట్ కి సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆగస్టు 12న హైదరాబాద్ - శిల్పకళా వేదికలో ఈ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల మాట్లాడుతూ, ఇది ఎన్టీఆర్ ఇమేజ్ కి తగిన కథ అనీ .. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఈ సినిమాకి హైలైట్ అవుతాయని అన్నాడు. ఇక ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, కొరటాల .. ఎన్టీఆర్ తో కలిసి ఇంతమంచి సినిమా చేసినందుకు తమకి చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)