ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదే మహేశ్ ఇంట్రడక్షన్ సాంగ్ స్పెషాలిటీ!

Thu, Aug 04, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా ఒక సినిమా తెరకెక్కుతోంది. జూలై 29వ తేదీన మొదలైన ఈ సినిమా షూటింగ్ ఈ నెల 12వ తేదీ వరకూ కొనసాగనుంది. ఆ తరువాత 18వ తేదీ నుంచి మళ్లీ షూటింగ్ మొదలవుతుంది.

మహేశ్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ తో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుందనే వార్తలు చాలా రోజుల క్రితమే వినిపించాయి. అలాగే వారం రోజులుగా నైట్ ఎఫెక్టులో ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరిస్తూ వస్తున్నారు. డాన్స్ కొరియో గ్రాఫర్ .. యాక్షన్ కొరియో గ్రాఫర్ కలిసి డిజైన్ చేసిన ఇంట్రడక్షన్ సాంగ్ వైవిధ్యభరితంగా వుండనుందని చెబుతున్నారు. ఇంకా టైటిల్ ను ఖరారు చేయని ఈ సినిమాలో, కథానాయికగా రకుల్ అలరించనున్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)