ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

క్రిష్ దర్శకత్వంలో పవన్

Thu, Aug 04, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేయనున్నది సినిమా కాదు .. ఒక టీవీ షో. 'సత్యమేవ జయతే' తరహాలో ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారు నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.

'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా తరువాత ఆయన టీవీ షో షూటింగ్ లో పాల్గొనవలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. సామాజిక సమస్యల పట్ల స్పందించే పవన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ కార్యక్రమానికి, దర్శకత్వ బాధ్యతలను క్రిష్ వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుగుతున్నాయట.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)