ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీకాంత్ కి 80 కోట్లా?

Thu, Aug 04, 2016
'కబాలి'లో రజనీకాంత్
'కబాలి'లో రజనీకాంత్
రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన 'కబాలి' భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. తొలిరోజునే ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా, రజనీకాంత్ కి గల క్రేజ్ పై ఆ టాక్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఓవర్సీస్ లో ఇప్పటికీ ఈ సినిమా తన సత్తా చాటుతోంది.

ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త కోలీవుడ్ లో షికారు చేస్తోంది. ఈ సినిమాకి పారితోషికంగా రజనీకాంత్ 35 కోట్లు తీసుకున్నారట. ఇక లాభాలు భారీగానే రావడంతో అందులో షేర్ గా 45 కోట్లు అందుకున్నారని అనుకుంటున్నారు. ఇలా ఈ సినిమాపై రజనీకి 80 కోట్లు ముట్టాయని చెప్పుకుంటున్నారు. రెమ్యునరేషన్ .. షేర్ సంగతి అటుంచితే, ప్రపంచవ్యాప్తంగా రజనీకి గల క్రేజ్ ను ఈ సినిమా మరోమారు నిరూపించింది.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)