ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమలాపాల్ భర్త అలా అనేశాడు

Thu, Aug 04, 2016
అమలాపాల్
అమలాపాల్
అమలాపాల్ .. ఆమె భర్త విడాకులు తీసుకోనున్నారనే వార్త కొంతకాలంగా మీడియాలో హల్ చల్ చేస్తోంది. వివాహం తరువాత సినిమాలు చేయనని చెప్పిన అమలాపాల్, అందుకు విరుద్ధంగా వరుస సినిమాలు చేస్తోందంటూ ఆమె అత్త మామలు ఆగ్రహించడమే విడాకులకు దారితీసిందనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ విషయంపై ఆమె భర్త స్పందిస్తూ, ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని అన్నాడు. అమలాపాల్ ను సినిమాలు మానేయమని తన తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పలేదనీ, వాళ్లు అలాంటివాళ్లు కాదని ఆయన తేల్చి చెప్పాడు. విడాకులకు దారితీయడానికి కారణం సినిమాలు కాదనే అర్థంలో ఆయన మాట్లాడటంతో, అసలు కారణం ఏమైవుంటుందనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)