ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Aug 04, 2016
తమన్నా
తమన్నా
* మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఫైట్స్ చేస్తోంది. 'బాహుబలి 2' సినిమా కోసం జరుగుతున్న క్లైమాక్స్ షూటింగులో ఈ చిన్నది పాల్గొంటోంది. ఇందులో భాగంగా ప్రభాస్, రానాలతో కలసి ఫైట్ సీక్వెన్స్ లలో పాల్గొంటోంది. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఈ షూటింగ్ జరుగుతోంది.
* 'అందాలరాక్షసి' ఫేం నవీన్ చంద్ర హీరోగా ధర్మ-రక్ష సంయుక్త దర్శకత్వంలో రూపొందుతున్న 'చందమామ రావే' చిత్రం టీజర్ ను నిన్న సాయంకాలం విడుదల చేశారు. టీజర్ ను హీరో నాని రిలీజ్ చేయగా, దర్శకుడు మారుతి బ్యానర్ లోగోను విడుదల చేశారు.
* మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న 'లక్ష్మీ బాంబ్' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. ఈ నెల 15కి షూటింగ్ మొత్తం పూర్తవుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. కార్తికేయ గోపాల కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
* అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న 'భాగమతి' చిత్రం కోసం హైదరాబాదులో భారీ సెట్ ను వేస్తున్నారు. నిజాం కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఈ సెట్ ను నిర్మిస్తున్నారు. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)