ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సత్తా చాటుతోన్న 'పెళ్లిచూపులు'

Wed, Aug 03, 2016
'పెళ్లి చూపులు'లో రీతూ వర్మ
'పెళ్లి చూపులు'లో రీతూ వర్మ
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలుగా వచ్చి భారీ విజయాలను అందుకున్నవాటి జాబితాలో, 'పెళ్లిచూపులు' కూడా చేరిపోయింది. విడుదలకి ముందే ఈ సినిమా ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది. విడుదలైన తరువాత అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

విజయ్ దేవరకొండ .. రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమాకి, తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం. ఇక యూఎస్ లోను ఈ సినిమా తన సత్తా చాటుతోంది. ఇంతవరకూ ఈ సినిమా అక్కడ 2 కోట్ల 20 లక్షలు రాబట్టినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి లభిస్తోన్న ఆదరణ చూస్తుంటే, వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)