ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Wed, Aug 03, 2016
హెబ్బా పటేల్
హెబ్బా పటేల్
* నాగ అన్వేశ్ హీరోగా పళని దర్శకత్వంలో 'ఏంజెల్' పేరిట ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. ఇందులో టైటిల్ రోల్ లో హెబ్బా పటేల్ నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 10న హైదరాబాదులో మొదలవుతుంది.
* పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న 'ఇజం' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని గోల్కొండ ఫోర్ట్ లో జరుగుతోంది. దీని తర్వాత వచ్చే వారం తదుపరి షూటింగ్ కోసం చిత్రం యూనిట్ స్పెయిన్ వెళుతుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు.
* బి.జయ దర్శకత్వంలో 'వైశాఖం' పేరిట ఓ రొమాంటిక్ స్టోరీ తెరకెక్కుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే చివరి షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బి.ఏ. రాజు నిర్మిస్తున్నారు.
* కొంత కాలం గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల మరో చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా నటించే ఈ చిత్రం షూటింగును ఈ నెల 5న హైదరాబాదులో ప్రారంభిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)