ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్ కి చిరూ ఛాన్స్ ఇచ్చేసినట్టే!

Tue, Aug 02, 2016
చిరంజీవి
చిరంజీవి
చిరంజీవి సినిమాలో ఛాన్స్ దొరకాలని నటీనటులు ఎంతగా అనుకుంటారో, ఆయన సినిమాకి పనిచేయాలని సాంకేతిక నిపుణులు అంతే అనుకుంటారు. అలాంటి అవకాశం అడక్కుండానే వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదిగా ఉంటుంది. అలాంటి సంతోషాన్నే తమన్ ఇప్పుడు పొందుతున్నాడు.

'శ్రీరస్తు శుభమస్తు' సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ, తమన్ అందించిన పాటలు తనకి చాలా బాగా నచ్చాయని చెప్పారు. తన కోసం కొన్ని ట్యూన్స్ చేసి పెట్టమనీ, తనకి నచ్చితే తన తదుపరి సినిమాకి సంగీత దర్శకుడు ఆయనేనని అన్నారు. ఆ మాటలకు తమన్ సంతోషంతో పొంగిపోయాడు. చిరూ నెక్స్ట్ పిక్చర్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనేనని అక్కడున్నవాళ్లంతా ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)