ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్ డేట్

Tue, Aug 02, 2016
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జనతా గ్యారేజ్' సినిమా, ఒక పాట మినహా మిగతా చిత్రీకరణను పూర్తిచేసుకుంది. సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, ముందుగా ఆగస్టు 12న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ రోజుకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవచ్చనే ఆలోచనలో, సెప్టెంబర్ 2కి విడుదలను వాయిదా వేసుకున్నారు.

దాంతో ఆగస్టు 12వ తేదీపై ఆశలు పెట్టుకున్న అభిమానులు నిరాశకి లోనయ్యారు. వాళ్లలో ఉత్సాహాన్ని రేకెత్తించడం కోసం, ఆగస్టు 12న ఆడియోను రిలీజ్ చేయాలని ఈ సినిమా టీమ్ నిర్ణయించుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోను ఆ రోజున హైదరాబాద్ - శిల్పకళా వేదికలో ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజంగా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించే వార్తే!
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)