ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలయ్య 'రైతు'కి జగన్ సన్నిహితుడి కథ!

Tue, Aug 02, 2016
బాలకృష్ణ
బాలకృష్ణ
బాలకృష్ణ 100వ సినిమాగా కృష్ణవంశీ 'రైతు' సినిమా చేయాలని భావించాడు. అయితే బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' కథ వైపు మొగ్గుచూపడం వలన, ఆయన 101వ సినిమాగా 'రైతు' రానుంది. ఈ సినిమాకి కథ అందించినది ఎవరో కాదు, జగన్ సన్నిహితుడుగా చెప్పబడే ప్రియదర్శిని రామ్. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ద్వారా ఈయన చాలామందికి సుపరిచితుడే!

గతంలో వచ్చిన మనోడు .. టాస్ చిత్రాల దర్శకుడిగా.. నటుడిగా ఆయన ప్రేక్షకులకు పరిచయమే. ఆయనే 'రైతు' సినిమాకి కథను అందించాడనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. 'రైతు' సమస్యలు .. పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)