ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వినాయక్ పనితీరు అద్భుతమట!

Tue, Aug 02, 2016
వినాయక్
వినాయక్
చిరంజీవి 150వ సినిమాను గురించి ప్రముఖ సినీ రచయిత సత్యానంద్ తనదైన శైలిలో స్పందించారు. చిరంజీవి 'కత్తి' సినిమా రీమేక్ ను ఎంచుకోవడం సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు. చిరంజీవి చాలా గ్యాప్ తరువాత చేస్తోన్న సినిమా కావడం వలన, సంఖ్యా పరంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నది కావడం వలన భారీ అంచనాలు వుండటం సహజమేనని చెప్పారు.

అలాంటి సినిమాకి దర్శకత్వం వహించడమనేది వినాయక్ కి ఓ పెద్ద ఛాలెంజ్ వంటిదేనని అన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ లో అవసరమైన మార్పులను వినాయక్ అద్భుతంగా చేశాడని చెప్పారు. మెగా ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడానికిగాను ఆయనపడే తాపత్రయం తనకి ఆశ్చర్యాన్ని కలిగించిందనీ, షూటింగ్ చాలా బాగా జరుగుతోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా, చిరంజీవి తన 150వ సినిమా కోసం పలు కథలు వినేటప్పుడు సత్యానంద్ ని కూడా పిలిచి వినమని, అభిప్రాయం చెప్పమనేవారట!
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)