ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీని చూడగానే చరణ్ లో ఉత్సాహం!

Tue, Aug 02, 2016
చరణ్
చరణ్
చరణ్ ఒక వైపున తన 'ధ్రువ' సినిమా షూటింగుతోను .. మరో వైపున నిర్మాతగా చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన షూటింగుతోను బిజీబిజీగా వున్నాడు. ఈ కారణంగానే ఆయన 'కబాలి' సినిమాను కాస్త ఆలస్యంగా చూశాడు. తాను 'కబాలి' సినిమా చూసినట్టుగా ఆయనే స్వయంగా చెప్పాడు.

తెరపై రజనీ కనిపించగానే ఒక్కసారిగా తనలో ఉత్సాహం ప్రవేశించిందని చెప్పాడు. ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిదని అన్నాడు. 'కబాలి' టాక్ ఎలా వున్నా రజనీకాంత్ పై గల అభిమానంతోనే చరణ్ ఈ సినిమా చూసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా బిజినెస్ జరిగిన తీరు .. మార్కెటింగ్ వ్యవహారాలను గురించి తెలుసుకుంటూ, నిర్మాతగా అనుభవాన్ని సంపాదించే పనిలోనూ చరణ్ వున్నాడని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)