ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రభాస్ సినిమా ప్రత్యేకత అదే!

Tue, Aug 02, 2016
ప్రభాస్
ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'బాహుబలి 2' చిత్రం షూటింగ్ పూర్తి చేయడంలో బిజీగా వున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ వార్ ఎపిసోడ్ ను గత కొంత కాలంగా చిత్రీకరిస్తున్నారు. తన షూటింగ్ పార్ట్ పూర్తికాగానే ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెడతాడు. వెనువెంటనే సుజిత్ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగులో ఆయన పాల్గొంటాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి.
ఇక ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేయడానికి ఆయన అంగీకరించాడు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే జనవరి నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే, కథను బట్టి ఈ చిత్రం షూటింగ్ పూర్తిగా విదేశాల్లోనే జరుగుతుందట!
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)