ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గోల్కొండ కోటలో 'ఇజం' షూటింగ్

Mon, Aug 01, 2016
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ కథానాయకుడిగా 'ఇజం' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం గోల్కొండ కోటలో జరుగుతోంది. క్లైమాక్స్ దృశ్యాలను పూరీ తనదైన రీతిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

గతంలో 'పోకిరి'లో కొన్ని సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకోవడంతో, ఆ సెంటిమెంట్ తోనే పూరీ ఇక్కడ ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నాడని అంటున్నారు. జర్నలిస్టు పాత్రను పోషిస్తోన్న కల్యాణ్ రామ్, సిక్స్ ప్యాక్ తోను కనిపించనున్నాడు. ఆయన సొంత బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా, సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)