ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ మూవీకి ముహూర్తం ఖరారైనట్టే!

Mon, Aug 01, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
దర్శకుడు 'డాలీ'తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నాడు. ఇటీవల ఈ సినిమాపై కొన్ని రూమర్లు వచ్చాయి. ఈ సినిమా స్క్రిప్ట్ పై డాలీ ఇంకా కసరత్తు చేయవలసి ఉందనీ, పవన్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపించడం లేదనే పుకారు షికారు చేసింది. వాటన్నింటికి తెరదించేస్తూ, ఈ సినిమా ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నెల 6వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆరంభించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాను డిసెంబర్ నాటికి పూర్తిచేసి, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇందులో పవన్ సరసన శ్రుతిహాసన్ నటించనున్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)