ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెరపైకి సీనియర్ హీరోయిన్ వారసుడు!

Mon, Aug 01, 2016
తనయుడు అదీప్ తో సిమ్రాన్
తనయుడు అదీప్ తో సిమ్రాన్
తెలుగు తెరపై తన జోరు చూపించిన నిన్నటి తరం కథానాయికలలో సిమ్రాన్ ఒకరు. వివాహం తరువాత సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చిన సిమ్రాన్, సెకెండ్ ఇన్నింగ్స్ లో బిజీ కావాలనే పట్టుదలతో వుంది. ఇక తన పెద్ద కుమారుడిని కూడా వెండితెరకి పరిచయం చేయాలని ఆమె నిర్ణయించుకుందట.

సిమ్రాన్ పెద్ద కుమారుడు 'అదీప్' .. ఇటీవల తల్లితో కలిసి ఒక యాడ్ లో నటించాడు. అతను బాగా నటించడం చూసి మురిసిపోయిన సిమ్రాన్, బాలనటుడిగా వెండితెరకి పరిచయం చేయాలనుకుంది. ఆ దిశగా సన్నాహాలు మొదలుపెట్టిందని అంటున్నారు. త్వరలోనే 'అదీప్' అల్లరిని తెరపై చూడబోతున్నామన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)