ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భవిష్యత్ గురించి నయన్ ఆలోచించడం లేదట!

Mon, Aug 01, 2016
నయనతార
నయనతార
ప్రభుదేవాతో నయనతార ప్రేమ వ్యవహారం .. ఆ తరువాత కొన్ని పరిస్థితుల కారణంగా ఇద్దరూ విడిపోవడం అందరికీ తెలిసిందే. ఆ విషయాలను గురించి రీసెంట్ గా ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడింది.

ప్రేమించిన వ్యక్తి కోసం తాను సినిమాలను కూడా వదులుకోవాలని నిర్ణయించుకున్నాననీ, ప్రేమ కోసం తాను ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతానని తెలియజెప్పడం కోసమే అప్పట్లో తాను ఆ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పింది. అయితే మనస్పర్థలు వచ్చిన తరువాత ఆ బాధను మరిచిపోవడానికి సినిమాలనే మార్గంగా ఎంచుకోవలసి వచ్చిందని అంది. తన జీవితంలో తాను అనుకున్నట్టుగా ఏదీ జరగలేదనీ, అందువలన భవిష్యత్తు గురించిన ఆలోచన చేయడం లేదని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)