ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' కేరళ బిజినెస్ అదుర్స్!

Mon, Aug 01, 2016
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ముస్తాబవుతున్న 'జనతా గ్యారేజ్' సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచీ అటు ప్రేక్షకులలోనూ... ఇటు బిజినెస్ వర్గాలలోను విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. కొన్ని ఏరియాలలో రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నందున సినిమాకి అదనపు ఆకర్షణ అయింది. మలయాళం డబ్బింగు వెర్షన్ కు అదే ఇప్పుడు పెద్ద ప్లస్ అవుతోంది. మలయాళం వెర్షన్ థియేటిరికల్ హక్కుల రూపంలో నిర్మాతకు 7 కోట్ల ఆదాయం వచ్చినట్టు తాజా సమాచారం. ఒక తెలుగు సినిమాకు మలయాళంలో ఇంతటి రేటు పలకడం ఇదే ప్రథమం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో ఈ చిత్రం ప్రమోషన్ బాధ్యతలను మోహన్ లాల్ తీసుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)