ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Mon, Aug 01, 2016
సమంత
సమంత
* తాను అదృష్టాన్ని బాగా నమ్ముతానని అంటోంది చెన్నయ్ చిన్నది సమంత. "ఈ పరిశ్రమలో నా కంటే ప్రతిభ గలవాళ్లు, తెలివైన వాళ్లు చాలా మంది వున్నారు. అయినా నాకు ఈ పొజిషన్ వచ్చిందంటే అదంతా నా అదృష్టమే. అందుకే విధిని నేను నమ్ముతాను" అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
* కన్నడలో వచ్చిన 'శివలింగ' చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, నటుడు లారెన్స్ హీరోగా తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నడలో దర్శకత్వం వహించిన పి.వాసు ఈ తమిళ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు నుంచి బెంగళూరులో జరుగుతుంది.
* తమిళంలో హిట్టయిన 'ఈట్టి' చిత్రాన్ని అక్కినేని నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ చేయనున్నారు. తమిళ ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన రవి అరసు దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఈ విషయం గురించి దర్శకుడు రవి చెబుతూ, ప్రస్తుతం తాను చేస్తున్న తమిళ చిత్రం పూర్తి కాగానే చైతూ సినిమా మొదలవుతుందని చెప్పాడు.
* రామ్ చరణ్ నటిస్తున్న 'ధ్రువ' చిత్రంలో ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. తమిళ ఒరిజినల్ లో నాజర్ పోషించిన రాజకీయనాయకుడి పాత్రను పోసాని తెలుగు వెర్షన్ లో చేస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)