ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ సీక్వెల్ లో కూడా కథానాయిక తనే!

Sun, Jul 31, 2016
సోనాక్షి సిన్హా
సోనాక్షి సిన్హా
ఈమధ్య బాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ క్రమంలో 'దబాంగ్' చిత్రానికి మరో సీక్వెల్ వస్తోంది. సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన 'దబాంగ్', 'దబాంగ్ 2' సినిమాలు ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో 'దబాంగ్ 3' చిత్రాన్ని తీసుకువస్తున్నాడు నిర్మాత, దర్శకుడు అర్బాజ్ ఖాన్. ఈ సీక్వెల్ లో కూడా కథానాయికగా సోనాక్షినే ఎంచుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా అర్బాజ్ ఖాన్ మీడియాకు వెల్లడించాడు. ఇందులో సోనాక్షితో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని ఆయన చెప్పాడు.
కాగా, సల్మాన్ కి, సోనాక్షికి మధ్య ఇటీవల పొరపొచ్చాలు వచ్చాయని, దీంతో ఆమెపై సల్మాన్ కోపంగా ఉన్నాడని, అందువల్ల ఈ సీక్వెల్ లో సోనాక్షికి అవకాశం రాదనీ ఇటీవల బాలీవుడ్ లో వార్తలొచ్చాయి. అంతేకాదు, కథానాయికగా పరిణీతి చోప్రాను ఎంపిక చేసేశారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సోనాక్షి పేరును ప్రకటించి నిర్మాత అర్బాజ్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)