ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మెగా' చిత్రంలో పవన్ పాత్ర ఉందా?

Sun, Jul 31, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
అన్నయ్య సినిమాకి తమ్ముడు పవన్ కల్యాణ్ సాయం అందిస్తున్నాడా? ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త ఇదే. చిరంజీవి తన 150వ చిత్రాన్ని వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా చేస్తున్న సంగతి విదితమే. అయితే, ఈ చిత్రం ప్రారంభం రోజున కానీ, మరెక్కడా కానీ కనిపించని పవన్ కల్యాణ్ ఈ చిత్రం చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి ప్రతిష్ఠాత్మకం కావడంతో తను కూడా ఇన్వాల్వ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిని బ్లాక్ బస్టర్ మూవీ చేయడానికి పవన్ నడుం బిగించినట్టు చెబుతున్నారు.

దాంతో చిత్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను ఆయనే తీసుకుంటున్నాడని అంటున్నారు. అసలు 'కత్తి' తమిళ చిత్రాన్ని చేయమని చిరంజీవికి చెప్పిందే పవన్ అని తెలుస్తోంది. అలాగే, ఇందులో సునీల్ చేయాల్సిన పాత్రకు అలీని, తాజాగా కథానాయిక పాత్రకు కాజల్ ను ఎంపిక చేయడంలో పవన్ పాత్ర వుందట. అలాగే, స్క్రిప్టులో పవర్ ఫుల్ డైలాగులు లోపించాయన్న ఉద్దేశంతో ఇటీవలే మరో రచయితగా సాయిమాధవ్ బుర్రాను తీసుకోవడంలో కూడా పవన్ సలహా వుందని చెబుతున్నారు. మొత్తానికి, అన్నయ్య చిత్రాన్ని ఓ రికార్డు చిత్రంగా మలచడంలో తన వంతు పాత్రను పవన్ సైలెంట్ గా పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)