ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'తిక్క' కోసం పాట రాసిన నీరజ కోన!

Sat, Jul 30, 2016
నీరజ కోన
నీరజ కోన
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'తిక్క' సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా కోసం తమిళ కథానాయకులైన ధనుష్ - శింబులచే చెరో పాటను ఆయన పాడించాడు. అంతేకాదు ఈ సినిమాకి మరో ప్రత్యేకత కూడా వుంది. అదేమిటంటే .. టాలీవుడ్ లో కాస్ట్యూమ్ డిజైనర్ గా పేరు తెచ్చుకున్న నీరజ కోన ఒక పాట రాయడం.

సమంతా .. రకుల్ .. త్రిష .. నయనతార తదితరులతో టైమ్ స్పెండ్ చేస్తూ దిగిన ఫోటోలను తరచూ షేర్ చేస్తూ ఉండటం వలన ఆమె నెటిజన్లకు బాగా పరిచయమే. ఆమె పాట రాయడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే, తనకి చిన్నప్పటి నుంచి పోయమ్స్ వంటివి రాయడం అలవాటేనని చెప్పింది. తమన్ పట్టుబట్టి తనతో ఈ పాట రాయించాడని అంది. ''వెళ్లి పోకే .. '' అనే ఈ పాటను విన్నవాళ్లంతా చాలా బాగా రాశానని అంటున్నారని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)