ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'గూఢచారి'గా అడివి శేష్!

Sat, Jul 30, 2016
అడివి శేష్
అడివి శేష్
ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ వస్తోన్న అడివి శేష్ కి, 'క్షణం' చిత్రం మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది. ఈ సినిమా నటుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఆ తరువాత ఆయన నుంచి రాబోయే సినిమాల పట్ల యూత్ ఆసక్తిగా వుంది. ఈ నేపథ్యంలో తన తాజా చిత్రం 'గూఢచారి' అనే విషయాన్ని ఆయన ప్రకటించాడు.

ఈ సినిమాకి రాహుల్ పాకాల - శశికిరణ్ అనే ఇద్దరు దర్శకులుగా వ్యవహరించనుండటం విశేషం. ఈ సినిమాలో కథానాయికను ఇంకా ఖరారు చేయలేదుగానీ, ఆదా శర్మ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించే ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి మంచి ఆసక్తికరమైన టైటిల్ నే శేష్ ఫిక్స్ చేసుకున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)