ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు

Sat, Jul 30, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
ఇటీవల తమిళ సినిమాల రీమేక్ ల పట్ల పవన్ మరింత ఆసక్తిని చూపుతూ వస్తున్నాడు. ముఖ్యంగా అజిత్ .. విజయ్ ల సినిమాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన 'వేదాళం' రీమేక్ లో చేయనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

అజిత్ హీరోగా తమిళంలో ఎ.ఎం. రత్నం నిర్మించిన ఈ సినిమా, అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ తో రీమేక్ చేయడానికి రత్నం ప్రయత్నాలు మొదలెట్టి చాలా రోజులైంది. ఆయన ప్రయత్నం ఫలించి, తాజాగా ఈ రీమేక్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు. ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)