ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమలా పాల్ గొడవ ఆగేట్టు లేదు

Sat, Jul 30, 2016
అమలా పాల్
అమలా పాల్
అమలాపాల్ దంపతులు విడిపోనున్నారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. ముందుగా అమలా పాల్ భర్త విజయ్ .. ఆ తరువాత ఆమె మామగారు ఈ విషయంపై స్పందించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ గొడవపై కోలీవుడ్ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

అత్త మామలకు .. భర్తకు ఇష్టం లేనప్పుడు అమలా పాల్ నటించడం మానేస్తే బాగుండేదని కొంతమంది అంటున్నారు. పెళ్లికి ముందు అంగీకరించిన సినిమాలనే ఆమె చేస్తోందని, అవి కూడా గ్లామర్ ప్రాధాన్యత లేనివేనని మరికొంతమంది చెబుతున్నారు. అమలాపాల్ భర్త దర్శకుడు కాబట్టి, ఆమె నటించడం పట్ల అతనికి ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నారు. ఆమె నటించడానికి వీల్లేదని అంటోన్న తల్లిదండ్రులకు అతను సర్దిచెప్పకపోవడమే పరిస్థితి ఇంత దూరం రావడానికి కారణమని చెప్పుకుంటున్నారు. ఏదేవైనా ఈ గొడవ ఇంతటితో ఆగేట్టు కనిపించడం లేదు.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)