ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలయ్య తనయుడితో త్రివిక్రమ్?

Sat, Jul 30, 2016
మోక్షజ్ఞ
మోక్షజ్ఞ
ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలతో ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చిన త్రివిక్రమ్, త్వరలో నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోతో సినిమా చేసే ఛాన్స్ ఉందనే వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. కథానాయకుడిని అన్నివర్గాల ఆడియన్స్ కి చేరువ చేయడం త్రివిక్రమ్ కి బాగా తెలుసు. అందువలన ఆయన దర్శకత్వంలో మోక్షజ్ఞను పరిచయం చేయాలనే ఆసక్తి బాలకృష్ణకి ఉందని చెబుతున్నారు.

ఇక మోక్షజ్ఞతో సినిమా చేయడానికి త్రివిక్రమ్ కూడా ఉత్సాహాన్ని చూపుతున్నాడనీ, ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టాడని అంటున్నారు. ఈ రేసులో కొరటాల శివ కూడా వున్నాడని చెప్పుకుంటున్నారు. 'జనతా గ్యారేజ్' బంపర్ హిట్ కొడితే, మోక్షజ్ఞతో సినిమా చేసే అవకాశం ఆయనకి వెళ్లవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)