ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మెగా' టైటిల్ విషయంలో అయోమయం!

Sat, Jul 30, 2016
చిరంజీవి
చిరంజీవి
ఒక వైపున చిరంజీవి సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. మరో వైపున ఈ సినిమాకి ఇంతవరకూ కథానాయిక ఖరారు కాకపోవడం అభిమానులను అసహనానికి గురిచేస్తోంది. ఇక ఇప్పుడు టైటిల్ విషయం కూడా వాళ్లు బాగా ఎదురుచూసేలా చేస్తోంది.

ఈ సినిమా టైటిల్ 'కత్తిలాంటోడు' కాదని చరణ్ చెప్పడంతో ఆలోచనలో పడ్డారు. ఆ తరువాత 'ఖైదీ నెంబర్ 150' టైటిల్ ను ఖరారు చేసే ఛాన్స్ ఉందనే వార్తలు వచ్చాయి. ఇదేదో బాగానే ఉందని అనుకునేలోగానే, 'నెపోలియన్' అంటూ ఒక పోస్టర్ వచ్చేసింది. ఆ టైటిల్ వేరే వారిది అనే విషయం ఆ వెంటనే బయటికి వచ్చింది. ఇక తాజాగా చరణ్ 'కత్తిలాంటోడు' టైటిల్ ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించాడు. అయితే అది చిరూ సినిమా కోసమా? ... తన సినిమా కోసమా? అనే అయోమయంలో మెగా అభిమానులు వున్నారు. ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)