ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ కథకు త్రివిక్రమ్ వెండితెర రూపం!

Sat, Jul 30, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లో మంచి నటుడు, దర్శకుడు మాత్రమే కాకుండా మంచి రచయిత కూడా వున్నాడు. అందుకే, తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్టు పనిలో ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుంటారు. ఆయా రచయితలకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన రాసిన ఒక కథ త్వరలో తెరకెక్కనుంది. పైగా, దీనికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. పవన్, త్రివిక్రమ్ మంచి స్నేహితులు. ఇద్దరూ కూర్చుంటే ఎక్కువగా రచనల గురించే సంభాషించుకుంటారు. అలా ఇటీవల కలసినప్పుడు పవన్ చెప్పిన కథ త్రివిక్రమ్ కు బాగా నచ్చిందట. దాంతో త్వరలో ఆయన దానిని తెరమీద ఆవిష్కరించనున్నట్టు చెబుతున్నారు. అయితే, ఇందులో పవన్ నటిస్తారా? లేక మరొకరు నటిస్తారా? అన్నది ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా తమ తమ ప్రాజక్టులతో బిజీగా వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)