ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హారర్ నేపథ్యంలో వెంకీ మూవీ?

Fri, Jul 29, 2016
వెంకటేశ్
వెంకటేశ్
వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన 'బాబు బంగారం' సినిమా, ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన 'సాలా ఖడూస్' రీమేక్ లో చేస్తారనే వార్త షికారు చేస్తోంది. ఆ తరువాత ఆయనని ఒప్పించడానికి ఇద్దరు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకరు ఓంకార్ అయితే .. మరొకరు తరుణ్ భాస్కర్.

గతంలో ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన 'రాజుగారి గది' హిట్ కావడంతో, సీక్వెల్ కి కథను సిద్ధం చేశాడు. ఇందులో వెంకటేశ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక తరుణ్ భాస్కర్ కూడా ఇటీవలే ఒక కథను వెంకీకి వినిపించాడట. అది కూడా హారర్ నేపథ్యంతో కూడినదే కావడం విశేషం. మరి ఈ రెండింటిలో ఏ ఒక్కదానికైనా వెంకీ ఓకే చెబుతాడేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)