ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రేపటి గురించి ఆలోచించదట!

Fri, Jul 29, 2016
కేథరిన్
కేథరిన్
తెలుగు తెరపై అందానికి అర్థం చెప్పిన కథానాయికల జాబితాలో కేథరిన్ కూడా కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఇప్పుడిప్పుడే ఆమె తన స్పీడు పెంచే పనిలో వుంది. ప్రస్తుతం ఆమె గోపీచంద్ జోడీగా ఒక సినిమాలోను, రానా సరసన కథానాయికగా మరో సినిమాలోను నటిస్తోంది. ఆకర్షణీయమైన కళ్లతో కట్టిపడేసే కేథరిన్, కథ వినగానే తనలో ఆసక్తి కలిగితేనె ఆ పాత్రను చేయడానికి అంగీకరిస్తానని చెబుతోంది.

సాధ్యమైనంత వరకూ సహజత్వానికి దగ్గరగా వుండే పాత్రలనే ఒప్పుకుంటానని కేథరిన్ అంటోంది. పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటు ఉండటం వలన, పాత్రల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెబుతోంది. రేపటి రోజు గురించి తాను ఆలోచించననీ, ఈ రోజు కోసమే బ్రతుకుతానని .. అదే మొదటి నుంచి తనకి అలవాటని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)