ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్లు శిరీష్ 'జగదేకవీరుని కథ'

Fri, Jul 29, 2016
అల్లు శిరీష్
అల్లు శిరీష్
అల్లు శిరీష్ తాజా చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు' వచ్చేనెల 5వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఎం.వి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ ఒక సినిమా చేయనున్నాడు. 700 సంవత్సరాల క్రితానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ కొనసాగుతుందని చెప్పారు.

ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో అల్లు శిరీష్ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ విషయం బయటికి వచ్చిన దగ్గర నుంచి, ఈ సినిమాకి టైటిల్ ఎలా ఉంటుందా అనే దానిపై అభిమానులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ 'జగదేకవీరుని కథ' అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించినట్టు సమాచారం. ఈ టైటిల్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించడం ఖాయమనిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)