ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆడియో రిలీజ్ కి రెడీగా 'తిక్క'

Fri, Jul 29, 2016
'తిక్క' లో సాయిధరమ్ తేజ్
'తిక్క' లో సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో 'తిక్క' సినిమా రూపొందింది. రోహిణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ జోడీగా లారిస్సా బొనేసి కథానాయికగా అలరించనుంది. ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 30న నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా కోసం, కోలీవుడ్ యువ కథానాయకులైన ధనుష్ .. శింబు చెరో పాట పాడారు. ఇది ఈ సినిమాకి ఓ విశేషంగా నిలుస్తుందని అంటున్నారు. ఆడియో రిలీజ్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)