ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ సినిమాకి ఒకే టైటిల్ పెడతారట!

Fri, Jul 29, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
సాధారణంగా రెండు భాషల్లో ఏకకాలంలో ఒక సినిమాను నిర్మిస్తుంటే కనుక ఆయా భాషలను బట్టి సినిమా టైటిల్ వేరుగా వుంటుంది. ఆ భాషలోని ఆ పదానికున్న అర్థాన్ని బట్టి, క్యాచీగా ఉండేలా టైటిల్ నిర్ణయిస్తారు. అయితే, ఇప్పుడు మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో కామన్ టైటిల్ నిర్ణయించడానికి ఆలోచిస్తున్నారట.
80 కోట్ల బడ్జెట్టుతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, రెండు భాషలలోను వేర్వేరు టైటిళ్లు వుండడం కన్నా, కామన్ టైటిల్ గా ఒకటే వుంటే బాగుంటుందని, సినిమాకి మంచి హైప్ వస్తుందని నిర్ణయానికొచ్చిన దర్శక నిర్మాతలు ఆ విధంగా ఆలోచిస్తున్నారట. ఇలా కామన్ టైటిల్ ఉండాలంటే, బాగా వాడుకలో క్యాచీగా వుండే ఇంగ్లిష్ పదమే సూటవుతుందని మనం అనుకోవచ్చు!
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)