ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొరటాలకి మహేశ్ ఆ మాట చెప్పాడట!

Thu, Jul 28, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
కొరటాల శివ తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉండనుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మహేశ్ బాబు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పనుల నుంచి ఫిబ్రవరి నాటికి మహేశ్ ఫ్రీ అవుతాడట.

ఆలోగా పూర్తి కథను సిద్ధం చేసి తనకి చెప్పమని కొరటాలతో మహేశ్ చెప్పాడట. ప్రస్తుతం కొరటాల చేస్తోన్న 'జనతా గ్యారేజ్' సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఆ తరువాత కొరటాల ఒక నెల పాటు విశ్రాంతి తీసుకుని, మహేశ్ మూవీకి సంబంధించిన కథపై కూర్చుంటాడట. మొత్తానికి ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే ఏడాది మరో బ్లాక్ బస్టర్ రాబోతుందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)