ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ మాటను విత్ డ్రా చేసుకున్న దర్శకుడు!

Thu, Jul 28, 2016
తమ్మారెడ్డి భరద్వాజ
తమ్మారెడ్డి భరద్వాజ
తెలుగు సినిమాను వినూత్నమైన రీతిలో ఆవిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ, తెలుగు చిత్రపరిశ్రమలో మగాళ్లే లేరా? అంటూ తమ్మారెడ్డి భరద్వాజ ఒకప్పుడు తన నిరసన తెలిపిన తీరును గుర్తుచేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో తెలుగు సినిమా విషయంలో వస్తోన్న మార్పులు ఆనందాన్ని కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

యువ దర్శకులు ఎంతోమంది తమ ప్రతిభాపాటవాలతో, తెలుగు సినిమాను కొత్తదనం వైపు పరుగులు తీయిస్తున్నారని చెప్పారు. వేదం .. పిల్ల జమీందారు .. ప్రేమకథా చిత్రం .. ఉయ్యాలా జంపాలా .. ఎక్స్ ప్రెస్ రాజా .. ఇలా విభిన్నమైన కోణాల్లో తెలుగు సినిమా ఆవిష్కరించబడుతుండటం సంతోషించదగిన పరిణామమని అన్నారు. ఈ తరహాలో వస్తున్నదే 'పెళ్లి చూపులు' చిత్రమని చెప్పారు. ఈ సినిమా చూశాక .. యువతరానికి తెలుగు సినిమా పోకడను మార్చే శక్తి ఉందంటూ, గతంలో తానన్న మాటను వెనక్కితీసుకోవడానికి తాను ఎంత మాత్రం సందేహించడం లేదని ఆయన అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)