ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బ్యాడ్ పోలీస్ గా రవితేజ

Thu, Jul 28, 2016
రవితేజ
రవితేజ
ఎప్పుడూ లేనిది .. ఈ ఏడాది రవితేజకి కొంత గ్యాప్ వచ్చింది. దాంతో ఆయన సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చేనెలలో సెట్స్ పైకి వెళుతున్నట్టు తెలుస్తోంది.

వక్కంతం వంశీ వినిపించిన ఒక కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా విక్రమ్ సిరి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో తనని తాను ఎక్కువగా అంచనా వేసుకునే ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్నాడట. ఈ పాత్రను మలచిన తీరు రవితేజకి బాగా నచ్చిందని చెబుతున్నారు. గతంలో తాను పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించినా, వాటికి ఇది పూర్తి భిన్నంగా ఉండటంతో రవితేజ హ్యాపీగా వున్నాడని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)