ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరంజీవికి విలన్ ఖరారయ్యాడా?

Thu, Jul 28, 2016
తరుణ్ అరోరా
తరుణ్ అరోరా
చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమా టైటిల్ .. నాయిక .. విలన్ విషయంలో ఆసక్తి అభిమానులను వెంటాడుతూనే వుంది. విలన్ విషయానికే వస్తే, బాలీవుడ్ నుంచే విలన్ ను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ ను విలన్ గా తీసుకునే అవకాశాలు వున్నాయంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తరువాత వివేక్ ఒబెరాయ్ ను సంప్రదిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు 'తరుణ్ అరోరా' పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనని విలన్ గా ఎంపిక చేసే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో సస్పెన్స్ కి తెరపడనుంది.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)