ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Jul 28, 2016
రాశిఖన్నా
రాశిఖన్నా
* ప్రస్తుతం చేస్తున్న గ్లామర్ పాత్రలతో పాటు సత్తా వున్న క్యారెక్టర్లు కూడా చేయాలని వుందంటోంది కథానాయిక రాశిఖన్నా. 'గీతాంజలి' సినిమాలోని కథానాయిక పాత్ర లాంటివి చేయాలని వుందని తమ మనసులోని మాటను తాజాగా బయటపెట్టింది.
* ప్రముఖ పంపిణీ సంస్థ అభిషేక్ పిక్చర్స్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగిడింది. ఒకేసారి ఐదు చిత్రాలను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఒక చిత్రం, నిఖిల్- సుధీర్ వర్మ కాంబినేషన్లో మరో చిత్రం, అడవి శేష్, ఆదా శర్మ జంటగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఇంకో సినిమా, సుధీర్ బాబు హీరోగా పుల్లెల గోపీచంద్ జీవితకథతో మరో సినిమా, హిందీ 'హంటర్' తెలుగు రీమేక్ లను అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
* ప్రముఖ నటి సుమలత మళ్లీ పూర్తి స్థాయిలో నటిగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అల్లు శిరీష్ కథానాయకుడుగా రూపొందిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రంలో ఈమె ఓ కీలక పాత్ర పోషించిందని, దీని తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వస్తాయని అంటున్నారు.
* ప్రస్తుతం తాను పన్నెండు చిత్రాలతో బిజీగా వున్నట్టు ప్రముఖ నటుడు సాయికుమార్ చెప్పాడు. నిన్న 56వ జన్మదినాన్ని జరుపుకున్న సాయికుమార్ మాట్లాడుతూ, తెలుగులో మూడు చిత్రాలలోను, కన్నడలో తొమ్మిది చిత్రాలలోనూ నటిస్తున్నట్టు చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)