ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆలోచనలో పడేసిన 'శభాష్ నాయుడు'

Wed, Jul 27, 2016
కమలహాసన్
కమలహాసన్
కమలహాసన్ .. రమ్యకృష్ణ .. శ్రుతిహాసన్ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న 'శభాష్ నాయుడు' మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. అయితే ఈ సినిమాలో పనిచేస్తోన్న కొంతమందికి ఎదురైన సంఘటనలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతను చేపట్టిన రాజీవ్ కుమార్, లాస్ ఏంజిల్స్ లో మొదటి షెడ్యూల్ మొదలుకాగానే అనారోగ్యానికి గురయ్యాడు.

దాంతో ఈ షెడ్యూల్ షూటింగును కమల్ పూర్తిచేశారు. అక్కడి నుంచి తిరిగిరాగానే, కమల్ తన ఆఫీసులో కాలుజారి పడిపోయారు. కాలుకి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి ఎడిటర్ గా పనిచేస్తోన్న జేమ్స్ జోసఫ్ భార్యకి ప్రమాదం జరగడంతో, ఆయన అక్కడి నుంచి వచ్చేశాడు. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాడు. 'శభాష్ నాయుడు'కి ఏవైందో ఏంటో మరి!
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)