ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పోలీస్ ఆఫీసర్ పాత్రలో నయనతార

Wed, Jul 27, 2016
నయనతార
నయనతార
నయనతార హైటూ .. పర్సనాలిటీకి ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగా నప్పుతుందని అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నయనతార కూడా అలాంటి రోల్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అలాంటి అవకాశం ఆమెకి 'ఇరుముగన్'(ఇంకొక్కడు) సినిమాతో వచ్చింది.

విక్రమ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, నయనతార పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందట. ఈ పాత్రలో ఆమె ఫైటింగులు అదరగొట్టేసిందనేది యూనిట్ సభ్యుల మాట. ఈ సినిమా తరువాత ఆమె క్రేజ్ మరింతగా పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయశాంతికి 'కర్తవ్యం'లా, నయనతార కెరియర్లో ఈ సినిమా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)