ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నా 'అభినేత్రి' టైటిల్ మారనుందా?

Wed, Jul 27, 2016
'అభినేత్రి'లో తమన్నా, ప్రభుదేవా
'అభినేత్రి'లో తమన్నా, ప్రభుదేవా
తమన్నా ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న 'అభినేత్రి' సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ హారర్ మూవీలో తమన్నా సంప్రదాయబద్ధమైన చీరకట్టులోను .. మోడ్రన్ డ్రెస్సుల్లోను కనిపించనుంది. ఆమె ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాకి తెలుగులో 'అభినేత్రి' అని .. తమిళంలో 'దేవి' అని టైటిల్ ను ఖరారు చేశారు.

అయితే తెలుగులోను 'దేవి' పేరుతోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన రావలసి వుంది. ప్రభుదేవా కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా నుంచి, ఆగస్టు 1న ఒక టీజర్ రానుంది. ఆగస్టు 15న ఆడియో వేడుకను నిర్వహించి, సెప్టెంబర్ 9న సినిమాను రిలీజ్ చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)